రైల్వే ఫ్లెక్సీ–ఫేర్‌కి మరోసారి మార్పులు | Once again changes to Railway Flexi-Fare | Sakshi
Sakshi News home page

రైల్వే ఫ్లెక్సీ–ఫేర్‌కి మరోసారి మార్పులు

Mar 29 2017 3:14 AM | Updated on Sep 5 2017 7:20 AM

రైల్వే ఫ్లెక్సీ–ఫేర్‌కి మరోసారి మార్పులు

రైల్వే ఫ్లెక్సీ–ఫేర్‌కి మరోసారి మార్పులు

డిమాండ్‌కు అనుగుణంగా చార్జీలు (ఫ్లెక్సీ–ఫేర్‌) విధానంలో మరోసారి మార్పులు తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

న్యూఢిల్లీ: డిమాండ్‌కు అనుగుణంగా చార్జీలు (ఫ్లెక్సీ–ఫేర్‌) విధానంలో మరోసారి మార్పులు తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ విధానంలో అందుబాటులో ఉన్న సీట్లు చాలా మిగులుతుండటంతో సవరణలు చేయాల్సిందిగా రైల్వే మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. ఈ విధానం ప్రకారం రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో 10 శాతం బెర్తులను ప్రామాణిక ధరలకు కేటాయిస్తారు.

ఆ తర్వాత ప్రతి 10 శాతం సీట్లు నిండే కొద్దీ చార్జీ మరో 10 శాతం పెరిగిపోతుంటుంది. ప్రయాణికుల నుంచి స్పందన లేకపోవడంతో గతేడాది డిసెంబరులో రైల్వే శాఖ ఈ విధానానికి తొలిసారి సవరణ చేసి, రిజర్వేషన్‌ చార్ట్‌ తయారైన తర్వాత మిగిలిపోయిన బెర్తులను 10 శాతం తక్కువ ధరకే అమ్ముతోంది. ఇక నుంచి 50 శాతం సీట్లను ప్రామాణిక ధరలకు అమ్మాలని చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement