ఆన్‌లైన్‌లో ఆధార్‌ అప్‌డేట్‌ హిస్టరీ | Now get Aadhaar update history online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఆధార్‌ అప్‌డేట్‌ హిస్టరీ

Jun 7 2018 4:52 AM | Updated on Apr 3 2019 9:21 PM

Now get Aadhaar update history online - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌లో చేసుకున్న మార్పులుచేర్పులకు సంబంధించిన సమాచారాన్ని పౌరులు ఇకపై ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఇందుకోసం ఆధార్‌ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఫలితంగా ఆధార్‌ అప్‌డేట్‌ సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల సేవలు పొందవచ్చు. చిరునామాలో మార్పు, తప్పుగా ముద్రితమైన పేరు సవరణ తదితర సమాచారమంతా అప్‌డేట్‌ హిస్టరీగా భావిస్తాం. ముఖ్యంగా తరచూ చిరునామాలు మారే వారికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. ఇదెలా పనిచేస్తుందంటే.. వినియోగదారులు యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి ‘ఆధార్‌ అప్‌డేట్‌ హిస్టరీ’పై క్లిక్‌ చేయాలి. తరువాత అడిగిన చోట ఆధార్‌ సంఖ్య లేదా వర్చువల్‌ ఐడీని నింపాలి. అప్పుడు వచ్చిన ఓటీపీని వెబ్‌సైట్‌లో కనిపించే బాక్సులో వేయాలి. ఆ వెంటనే ఆధార్‌ అప్‌డేట్‌ హిస్టరీ కనిపిస్తుంది. ఈ విధానాన్ని బీటా వర్షన్‌లో ప్రారంభించినట్లు యూఐడీఏఐ సీఈఓ అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement