'సుష్మ కాదు.. మోదీనే సమాధానం చెప్పాలి' | no need of sushma and modi only answer on this issue, says kharge | Sakshi
Sakshi News home page

'సుష్మ కాదు.. మోదీనే సమాధానం చెప్పాలి'

Aug 12 2015 1:14 PM | Updated on Oct 8 2018 9:17 PM

'సుష్మ కాదు.. మోదీనే సమాధానం చెప్పాలి' - Sakshi

'సుష్మ కాదు.. మోదీనే సమాధానం చెప్పాలి'

లలిత్ గేట్పై సుష్మ స్వరాజ్ కాదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

న్యూఢిల్లీ : లలిత్ గేట్పై సుష్మ స్వరాజ్ కాదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం లోక్ సభలో లలిత్ మోదీ వ్యవహారంపై చర్చ సందర్భంగా  కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. చర్చకు ముందే అనుమతి ఇచ్చి ఉంటే సభా సమయం వృధా అయ్యేది కాదన్నారు. సభలో ఆందోళనలకు ప్రధాని మోదీయే కారణమని ఖర్గే ఆరోపించారు.  లలిత్ మోదీపై 16 కేసులు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా సభ దృష్టికి తెచ్చారు. ఆర్థిక నేరస్తుడికి సుష్మ సహాయం చేశారా? లేదా అని ఖర్గే ప్రశ్నించారు. మోదీకి సాయం చేయాలనుకుంటే చట్టప్రకారం చేసి ఉండాల్సిందన్నారు. ఎవరికీ తెలియకుండా సాయం చేయాల్సిన అవసరం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement