రేపు ఒడిశాలో నరేంద్ర మోదీ పర్యటన

Narendra Modi to visit Odisha on May 6 to take stock of the situation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఫొని తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆదివారం ఆయన ఒడిశాలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ మేరకు ప్రధాని శనివారం తన ట్వీటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. కాగా ఫొని తుపానుకు ఒడిశాలో ఎనిమిదిమంది మృతి చెందారు. 

మరోవైపు ఒడిశాలో ముందుజాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. భువనేశ్వర్‌, కోల్‌కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. భువనేశ్వర్‌, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వేష్టేన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. పై కప్పులు ఎగిరిపోయాయి. ఇక వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఫొని తుపాను గండం నుంచి బయటపడినా, భారీ వర్షాలు కురవడంతో ఒడిశాలో జన జీవనం స్తంభించిపోయింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top