కేబినెట్‌లో చేరితే తెలంగాణకే ప్రాధాన్యం | My first priority is Telangana, says badaru dattatreya | Sakshi
Sakshi News home page

కేబినెట్‌లో చేరితే తెలంగాణకే ప్రాధాన్యం

May 20 2014 10:48 AM | Updated on Mar 29 2019 9:24 PM

కేబినెట్‌లో చేరితే తెలంగాణకే ప్రాధాన్యం - Sakshi

కేబినెట్‌లో చేరితే తెలంగాణకే ప్రాధాన్యం

కేంద్ర కేబినెట్లో స్థానం లభిస్తే తెలంగాణకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు.

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్లో స్థానం లభిస్తే  తెలంగాణకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి ఎంఐఎం అండగా ఉంటుందని బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.

 ఎన్నికలు అయిన తర్వాత ఎంఐఎంతో టీఆర్ఎస్ జత కట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా  బండారు దత్తాత్రేయకు రైల్వే శాఖ సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. గత ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వే, పట్టణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా ఆయన పని చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement