‘సీబీఐ కాదు బీబీఐ’

Mamata Banerjee Said Now CBI Become BBI - Sakshi

కోల్‌కతా : ప్రతిష్టాత్మక దర్యాప్తు ఏజెన్సీ సీబీఐ వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. మోదీ సీబీఐని ‘బీబీఐ’గా మార్చారంటూ దీదీ ఆరోపించారు. ఉన్నతాధికారుల మధ్య అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో కొన్ని రోజులుగా సీబీఐ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థాన, అలోక్‌ వర్మలను సెలవుపై పంపటంతో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ క్రమంలో దీదీ సీబీఐని ‘బీబీఐ’(బీజేపీ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) అంటూ ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సెలవుపై పంపిచడం ఏంటంటూ ఆమె ప్రశ్నించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సీబీఐలో ఇలాంటి పరిస్థితులు చూడటం దురదృష్టకరం’ అంటూ దీదీ ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top