ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసిన మంత్రి

Madhya Pradesh Minister Jitu Patwari Clears Traffic Jam In Indore - Sakshi

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి జితు పట్వారీ చేసిన పనిపై పలవురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంగళవారం ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఇండోర్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అయితే చాలా సేపటివరకు పరిస్థితి అలానే ఉండటంతో మంత్రి తన వాహనంలో నుంచి కిందకు దిగి.. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసేందుకు ప్రయత్నించారు. వాహనదారులకు ఆదేశాలు ఇస్తూ.. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు మంత్రికి అక్కడున్న పలువురు సహకరించారు. మంత్రి రంగంలోకి దిగడంతో కొద్దిసేపట్లోనే అక్కడ ట్రాఫిక్‌ సమస్య తీరిపోయింది. 

మంత్రి తన కారు నుంచి దిగి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పనిచేయకపోవడంతో.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయినట్టుగా తెలుస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top