ఉగ్రవాదులకు పాక్‌సైన్యం శిక్షణ

LeT Terrorist Says, JuD Trained me - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ సైన్యం శిక్షణ అందిస్తోందన్న ఆరోపణలకు మరోసారి బలమైన సాక్ష్యం లభించింది. నవంబర్‌ 24న కశ్మీర్‌లో భద్రతాబలగాలకు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది.. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎన్‌ఐఏ విచారణలో చెప్పారు.  ముంబై దాడులు సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ ఏర్పాటు చేసిన ఉగ్రసంస్థ జమాతే ఉద్‌ దవా తనకు ఉగ్రశిక్షణ ఇచ్చిందని.. ఎన్‌ఐఏకు తెలిపారు. అలాగే పాకిస్తాన్‌ సైన్యం.. మిలటరీ ట్రైనింగ్‌ ఇవ్వడంతో పాటు భారత్‌లోరి రహస్యంగా పంపిందని ఎన్‌ఐఏ అధికారులుకు వివరించారు.

ఇదిలా ఉండగా అరెస్టయిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని అమీర్‌ బెన్‌ రియాజ్‌ అలియాస్‌ అబు హమాస్‌గా పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్‌లోని కరాచీ అతని స్వస్థలమని పోలీసులు చెబుతున్నారు.
హహీజ్‌ సయీద్‌ గృహ నిర్భంధం తరువాత భారత్‌పై మళ్లీ భారీ దాడికి పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హఫీజ్‌ సయీద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక మిలిటెంట్‌ను భద్రతాధికారులు పట్టుకోవడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top