వైరల్‌: విస్టారా, ఇండిగోలపై కామెడియన్‌ కామెంట్‌ | Kunal Kamra Funny Reply For IndiGo, Vistara Airlines Banter Due To Lockdown | Sakshi
Sakshi News home page

‘స్టే పార్కింగ్‌ స్టే సేఫ్‌.. ఇప్పుడు అర్థం అవుతుందా’

Apr 11 2020 2:34 PM | Updated on Apr 11 2020 2:46 PM

Kunal Kamra Funny Reply For IndiGo, Vistara Airlines Banter Due To Lockdown - Sakshi

దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌పై విస్టారా, ఇండిగో, గోఎయిర్‌, స్పెస్‌జెట్‌ భారతీయ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు సోషల్‌ మీడియాలో సరదాగా చర్చించిన సంభాషణ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో స్టాండ్‌ అప్‌ ఇండియన్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా  విస్టారా ఎయిర్‌లైన్‌పై చేసిన ట్వీట్‌ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రేండింగ్‌గా మారింది. ‘‘హే @airvistara నేను విన్నాను లాక్‌డౌన్‌ కారణంగా నిన్ను ఎత్తుకు ఎగరకుండా నిలిపివేశారంట కదా. ఎక్కడికి ఎగరకుండా పార్కింగ్‌లోనే జాగ్రత్తగా ఉండు. అలాగే ఇండిగో, స్పెస్‌జెట్‌, గోఎయిర్‌లు కూడా.. స్టేపార్కింగ్‌.. స్టేసేఫ్‌. ఇప్పటు మీకు అర్థం అవుతుంది నా బాధ’ అంటూ ఫన్నీగా ట్వీట్‌ చేశాడు. ఆయన సరదాగా చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెజన్లు తెగ ఆకట్టుకుంటోంది. (ప్రముఖ కమెడియన్‌పై ప్రయాణ నిషేధం)

కాగా మార్చిలో  విస్టారాతో పాటు ఇండిగో ఎయిర్‌ లైన్‌ అధికారుల లాక్‌డౌన్‌ అమలును అనుసరిస్తూ.. ఆయన ప్రయాణాన్ని నిషేధించినట్లు గతంలో ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఏప్రిల్‌ 27వరకూ ఎయిర్‌ విస్టారాతో పాటు మరో నాలుగు విమానా ఎయిర్‌లైన్‌ సంస్థలు నా ప్రయాణాన్ని నిషేధించాయి. అంతేగాక అధికారుల ఆదేశాల మేరకు ఎవరూ కూడా ప్రయాణించడాకి వీలు లేదని చెప్పారు’’ అంటూ కునాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల వ్యాపార రంగాలు మూతపడ్డాయి. అంతేగాక జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో విమానా సేవలు కూడా నిలిచిపోయాయి. (కరోనా: ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఫట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement