వయసు 8.. ఎత్తు 6.6 అడుగులు! | Karan Singh, The Tallest 8-Year-Old In The World | Sakshi
Sakshi News home page

వయసు 8.. ఎత్తు 6.6 అడుగులు!

Jun 15 2017 2:55 PM | Updated on Sep 5 2017 1:42 PM

వయసు 8.. ఎత్తు 6.6 అడుగులు!

వయసు 8.. ఎత్తు 6.6 అడుగులు!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కరణ్‌ సింగ్‌ ఇప్పుడు ఎనిమిదేళ్ల వయస్సులో ఆరడుల ఆరు అంగుళాల ఎత్తు పెరిగి అందర్ని ఆశ్చర్యపరుస్తున్నారు

మీరట్‌: పుట్టినప్పుడే రెండడుగులు పొడువు, ఆరున్నర కిలోల బరువుతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కరణ్‌ సింగ్‌ ఇప్పుడు ఎనిమిదేళ్ల వయస్సులో ఆరడుల ఆరు అంగుళాల ఎత్తు పెరిగి అందర్ని ఆశ్చర్యపరుస్తున్నారు. బడిలో తోటి విద్యార్థుల ముందు తాటి చెట్టంత పొడువు కనిపిస్తున్నాడు. భారత బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి అయిన ఈ బాలుడి తల్లి స్వెత్లాన్లా ఏడు అడుగుల రెండు అంగుళాల పొడవుతో దేశంలోనే అత్యంత పొడవైన మహిళగా రికార్డు నెలకొల్పారు. ఈ బాలుడి తండ్రి సంజయ్‌ ప్రస్తుం కుమారుడికన్నా కొంత పొడవుగా ఉన్నారు.

తాను తల్లికి మించి పొడవు పెరగాలని తన తల్లిదండ్రులు కోరుకుంటున్నారని కరణ్‌ సింగ్‌ చెప్పారు. కానీ తన సైజు దుస్తులు, బూట్లు దొరక్క ఇప్పటికే ఇబ్బంది పడుతున్నానని, భవిష్యత్తులో మరెంత ఇబ్బంది ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడవ తరగతి చదువుతున్న కరణ్‌ సింగ్‌ 12 నెంబరు బూట్లు ధరిస్తూ పదవ తరగతి పిల్లలు ధరించే దుస్తులను వేసుకుంటున్నారు. ఇప్పటికే ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో కరణ్‌ సింగ్‌ రెండు సార్లు ఎక్కారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement