ప్రేమించలేదని.. చేయి నరికేశాడు | Jilted stalker chops off girl's hand in Uttarpradesh | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని.. చేయి నరికేశాడు

Aug 26 2017 9:12 AM | Updated on Sep 17 2017 5:59 PM

ప్రేమించలేదని.. చేయి నరికేశాడు

ప్రేమించలేదని.. చేయి నరికేశాడు

పట్టపగలు.. నడి మార్కెట్లో చుట్టూ వందల మంది చూస్తుండగా.. పదిహేనేళ్ల యువతి చేతిని నరికేశాడో దుర్మార్గుడు.

సాక్షి, లక్నో: పట్టపగలు.. నడి మార్కెట్లో చుట్టూ వందల మంది చూస్తుండగా.. పదిహేనేళ్ల యువతి చేతిని నరికేశాడో దుర్మార్గుడు. ఎన్నో నెలలుగా ప్రేమిస్తున్నానని చెబుతూ చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన ప్రేమికుడు ఉన్మాదిగా మారాడు. వెంటతెచ్చుకున్న కత్తితో మార్కెట్లో సోదరుడితో కలసి షాపింగ్‌ చేస్తున్న ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాలియాలో గల లఖింపూర్‌ ఖేరీ మార్కెట్‌లో చోటు చేసుకుంది.

వినోద్‌ చౌరాసియా(19) స్థానిక వెల్డింగ్‌ షాపులో పని చేస్తున్నాడు. కొద్ది నెలలుగా బాలిక(15)ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇదిలావుండగా బుధవారం ఆమె లఖింపూర్‌ ఖేరీలో గల మార్కెట్‌కు తన సోదరుడితో కలసి షాపింగ్‌కు వచ్చింది. ఇది గమనించిన వినోద్‌.. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో కత్తితో ఆమె ఎడమ చేతిని నరికేశాడు. ఈ ఘటనలో బాలిక ఎడమ చేయి మణికట్టు వరకూ పూర్తిగా తెగి రోడ్డుపై పడింది.

ఆమె చేతి నుంచి పెద్ద మొత్తంలో రక్తం రోడ్డుపై పడింది. ప్రేయసి రక్త కళ్ల చూసిన వినోద్‌ కూడా అక్కడే కూలబడిపోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన బాలికను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎక్కువగా రక్తం పోవడంతో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అత్యవసర చికిత్స కోసం ఆమెను లక్నోలోని ఆసుపత్రికి తరలించనున్నట్లు వెల్లడించారు. దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement