
మాజీ సీఎంకు కోర్టు సమన్లు
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు కోర్టు సమన్లు జారీ చేసింది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు కోర్టు సమన్లు జారీ చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. విని ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ అనే సంస్థకు ఆయన అక్రమంగా బొగ్గు క్షేత్రాలు కేటాయించారని ఆరోపణలొచ్చాయి.
ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటును ప్రత్యేక జడ్జి భరత్ ప్రషార్ పరిగణనలోకి తీసుకున్నారు. కేసు విచారణను ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేస్తూ మధు కోడా సహా పలువురికి సమన్లు జారీచేశారు.