'జైట్లీ చాలా పెద్ద తప్పుచేశారు' | Jaitley made a big mistake by suing Kejriwal, says Jethmalani | Sakshi
Sakshi News home page

'జైట్లీ చాలా పెద్ద తప్పుచేశారు'

Dec 22 2015 1:36 PM | Updated on Sep 3 2017 2:24 PM

'జైట్లీ చాలా పెద్ద తప్పుచేశారు'

'జైట్లీ చాలా పెద్ద తప్పుచేశారు'

ఒకప్పటి బీజేపీ నేత, ప్రముఖ సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అండగా నిలిచారు. కేజ్రీవాల్ పై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేసి అతిపెద్ద తప్పు చేశారని అన్నారు.

న్యూఢిల్లీ: ఒకప్పటి బీజేపీ నేత, ప్రముఖ సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అండగా నిలిచారు. కేజ్రీవాల్ పై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేసి అతిపెద్ద తప్పు చేశారని అన్నారు. కేజ్రీవాల్ కు మాత్రమే కాదు ఇతర నేతలపై కూడా ఆ దావా వేయడం సరికాదని అన్నారు. ఈవిషయంలో తాను జోక్యం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.

మొత్తం రూ.పది కోట్లు తనకు చెల్లించాలని కోరుతూ అరుణ్ జైట్లీ ఢిల్లీ సీఎం ఆయన నేతలపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. దీనిపై రాం జెఠ్మలానీని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూ చేయగా ఆయన ఈ అభిప్రాయాలు తెలిపారు. 'ఇది నేను వ్యక్తిగతంగా తీసుకొని వ్యాఖ్యానించడం లేదు. జైట్లీ మాత్రం కేజ్రీవాల్ విషయంలో చెడ్డపనిచేశారు. ఈ సందర్భంగా నేను కేజ్రీవాల్ కు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను' అని జెఠ్మలానీ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement