ఇదే పరిస్థితి కొనసాగితే భాషలకు భవిష్యత్తు ఉండదు!
శానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు అయినా ప్రభుత్వ పాలనలో హిందీని విస్తృతంగా ఉపయోగించడం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ:దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు అయినా ప్రభుత్వ పాలనలో హిందీని విస్తృతంగా ఉపయోగించడం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో హెం శాఖ నిర్వహించిన రాజభాష కార్యక్రమంలో హెం మంత్రి మాట్లాడారు. దేశంలో 75 శాతం మంది ప్రజలకు హిందీ తెలియడం, మాట్లాడడం వచ్చినా అధికారిక కార్యక్రమాల్లో వినియోగం తగినంత లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే హిందీతో పాటు ఇతర భారతీయ భాషలకు భవిష్యత్తు ఉండబోదని ఆందోళన వ్యక్తం చేశారు.
21వ శతాబ్దం భారతీయ, ఆసియా ప్రాంత భాషలకు చెందినదని, వాటిని ప్రోత్సహించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హిందీ భాష వినియోగాన్ని ప్రోత్సహించిన వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు రాజభాష అవార్డులను ప్రదానం చేశారు.


