ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. ఇండియాలో..

Indian railways to build world's highest rail bridge - Sakshi

కౌరీ: చరిత్ర సృష్టించనున్న నిర్మాణానికి కొంకణ్‌ రైల్వే శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెన నిర్మాణ పనులను ఇండియన్‌ రైల్వే ప్రారంభించింది. నిర్మాణంలో భాగంగా ఆర్చ్‌ పనులను సోమవారం ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జీగా చరిత్ర పుటలకెక్కుతుంది. దీన్ని కశ్మీర్‌ లోయలోగల చినాబ్‌ నదిపై నిర్మిస్తున్నారు. ఈ నదికి 359 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మితమవుతోంది.

ఈ వంతెన కుతుబ్‌ మినార్‌ కంటే ఐదు రెట్లు ఎత్తు, ఈఫిల్‌ టవర్‌ కంటే 30 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉధమ్‌పూర్‌– శ్రీనగర్‌– బారాముల్లా రైల్‌ లింక్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇది కట్రా–ధరమ్‌ రైల్వే డివిజిన్‌ పరిధికి 73 కిలోమీటర్లు, కట్రాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.5,005 కోట్లను వెచ్చిస్తున్నారు. మొత్తం 1,315 మీటర్ల పొడవుగల వంతెన నిర్మాణానికి 25 వేల మిలియన్‌ టన్నుల స్టీల్‌ను ఉపయోగిస్తున్నామని, పనులు చాలా వేగంగా సాగుతున్నట్టు కొంకణ్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ రాజేష్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top