
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆదివారం ఉదయం గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆదంపూర్, హిస్సార్, హన్సి, జింద్, గోహానా, గనౌర్, బరూత్, రోహ్‌తక్, సోనిపట్, బాగ్‌పాట్, గురుగ్రామ్, నొయిడా, ఘజియాబాద్, ఫరిదాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులపాటు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఢిల్లీ, హరియాణ, చండీగఢ్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది.అయితే, కొద్ది రోజులుగా వర్షాలు లేక ఎండవేడిమి, ఉక్కపోతతో ఇబ్బందులుపడ్డ జనానికి ఈ వర్షంతో కాస్త ఉపశమనం దొరికింది. ఢిల్లీలో ఉక్కపోత తగ్గింది.
(సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ)