
'లేడీస్ టాయిలెట్ల నిర్మాణం మరిచిపోయారా'
మహిళల కోసం టాయిలెట్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చసింది.
మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చసింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో త్వరితగతిన టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టకుంటే తీవ్ర చర్యలకు సైతం వెనకాడబోమని మహారాష్ట్రలోని అన్ని నగర, పురపాలక సంస్థలను హెచ్చరించింది.
రాష్ట్రంలో మహిళా టాయిలెట్ల దుస్థితిపై ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన పిటిషన్ను విచారించిన జస్టిట్ ఏఎస్ ఓకా, జస్టిస్ సీవీ భండారీ దర్మాసనం ఈ మేరకు ఆయా సంస్థలకు నోటీసులు జారీచేసింది. జూన్ 19లోని పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. వాస్తవానికి గత డిసెంబర్ లోనే కోర్టు ఈ అంశంపై స్థానిక సంస్థలకు మార్గనిర్దేశనం చేసింది అయితే ముంబై, నాగ్పూర్, అమరావతి కార్పొరేషన్లు తప్ప మిగిలిన సంస్థలేవీ తగిన చర్యలు తీసుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.