‘ఆ కోరికను వివాహనికి ముందే తెలిపింది..’ | Groom comes in Helicopter to take Bride Home | Sakshi
Sakshi News home page

వధువు కోసం హెలికాప్టర్‌లో వచ్చిన ‘షారుక్‌’..

Nov 16 2017 6:39 PM | Updated on Nov 16 2017 6:56 PM

Groom comes in Helicopter to take Bride Home - Sakshi

జైపూర్‌: రాకుమారుడు రెక్కల  గుర్రం మీద వచ్చి తనను తీసుకెళ్లిన్నట్లు హీరోయిన్లలకు సినిమాలో కలలు వస్తుంటాయి. రెక్కల గుర్రం మాట ఏమో గానీ.. ఓ వరుడు తన కాబోయే భార్య కోరికను తీర్చేందుకు హెలికాప్టర్‌లో పెళ్లి మండపానికి వచ్చాడు. ఈ సంఘటన బుధవారం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఆమె సంతోషమే తన సంతోషంగా భావించిన వరుడు ఈ పని చేశాడని తెలుస్తోంది. 

వివరాలివి.. జైపూర్‌కి చెందిన షారుక్‌కు ఉత్తరప్రదేశ్‌కి చెందిన తాన్జిమ్తో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరి వివాహం  బుధవారం బంధు- మిత్రుల మధ్య ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. తన్జీమ్‌కు కాబోయే భర్త పెళ్లి మండపానికి హెలికాప్టర్‌లో హీరోలా రావాలినే కోరిక. ఆ కోరికను వివాహనికి ముందే ఆమె షారుక్‌కి తెలిపింది. కాబోయే భార్య మాటను గౌరవించి అతను కూడా ఒప్పుకున్నాడు.

ఆమె కోరిక మేరకు షారుక్‌ పెళ్లి మండపానికి హెలికాప్టర్‌లో వచ్చాడు. అంతేకాదండోయ్‌.. వివాహం తర్వాత కూడా నూతన వధూవరులు ఆ హెలికాప్టర్‌లో జైపూర్‌కు వెళ్లారు. వరుడు హెలికాప్టర్‌లో వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజలు మండపానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన పెండ్లి కొడుకు తన భార్యను ఇంటికి తీసుకెళ్లడానికి గత నెలలో హెలికాప్టర్‌లో రావడం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement