ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి: ములాయం | Give full freedom to Army to deal with situation in JK: Mulayam | Sakshi
Sakshi News home page

ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి: ములాయం

Jun 26 2017 2:54 PM | Updated on Sep 5 2017 2:31 PM

ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి: ములాయం

ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి: ములాయం

కశ్మీర్‌లో తలెత్తిన పరిస్థితులు చక్కబడాలంటే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ అన్నారు.

లక్నో: కశ్మీర్‌లో తలెత్తిన పరిస్థితులు చక్కబడాలంటే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ అన్నారు. సోమవారం ఆయన ఐషాబాగ్ ఈద్గాను సందర్శించారు. తన కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ వెళ్లిపోయిన తర్వాత ఇక్కడి వచ్చారు.

ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ..‘ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే అక్కడి(కశ్మీర్‌) పరిస్థితులు చక్కబడతాయి. శాంతి నెలకొంటుంది. అదే సమయంలో వేర్పాటువాదులను ఉక్కుపాదంతో అణచివేస్తుంద’ని అన్నారు. తీవ్రవాద దాడులు, సైనిక దళాలపై పౌరుల దాడులతో కశ్మీర్‌లోయ అట్టుడుకుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికపై మాట్లాడేందుకు ములాయం నిరాకరించారు. ఇప్పుడేమి మాట్లాడబోనని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement