రైలులో బాలికపై సైనికుల గ్యాంగ్ రేప్ | Girl alleges gang rape by army men in running train | Sakshi
Sakshi News home page

రైలులో బాలికపై సైనికుల గ్యాంగ్ రేప్

Dec 28 2015 8:27 PM | Updated on Sep 3 2017 2:42 PM

రైలులో బాలికపై సైనికుల గ్యాంగ్ రేప్

రైలులో బాలికపై సైనికుల గ్యాంగ్ రేప్

హౌరా-అమృత్సర్ ఎక్స్ప్రెస్ రైలులో ముగ్గురు సైనికులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రాంచీ: హౌరా-అమృత్సర్ ఎక్స్ప్రెస్ రైలులో ముగ్గురు సైనికులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.

స్నేహితురాలిని కలిసేందుకు లుధియానాకు వెళ్తూ, హౌరాలో ఆర్మీ కంపార్ట్మెంట్లోకి ఎక్కినట్టు బాధితురాలు చెప్పింది. రైలులో తనకు మత్తుపదార్థం ఇచ్చి ముగ్గురు సైనికులు లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. జార్ఖండ్లోని డియోగఢ్ జిల్లా మదుపూర్ రైల్వే స్టేషన్లో బాధితురాలు దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. కాగా ఈ ఘటనపై ఆర్మీ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement