
రియాజ్ ఎన్‌కౌంటర్‌పై సైన్యాన్ని అభినందించిన గౌతం గంభీర్
న్యూఢిల్లీ : ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను మట్టుబెట్టిన భారత సైన్యంపై మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతం గంభీర్ ప్రశంసలు గుప్పించారు. ‘రియాజ్ ఇక నరకంలో హాయిగా నిద్రపో..భారత సైన్యాన్ని ఎప్పుడూ రెచ్చగొట్టవద్ద’ని గంభీర్ ట్వీట్ చేశారు. కాగా జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బేగ్‌పురా గ్రామంలో కరుడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ ముజహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను భారీ ఆపరేషన్‌లో భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.
రంజాన్ సందర్భంగా తల్లితండ్రులను చూసేందుకు రియాజ్ గ్రామానికి వచ్చాడనే సమాచారంతో అతడి ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు సుదీర్ఘంగా సాగిన ఎన్‌కౌంటర్‌లో రియాజ్‌ను హతమార్చాయి.భారత సైన‍్యం సేవలను నిరంతరం కొనియాడే గౌతం గంభీర్ ఈ ఘటనను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఉగ్రవాదులకు గట్టి సందేశం పంపారు. భారత సైన్యంతో పెట్టుకోవద్దని హెచ్చరించారు.
చదవండి : ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత: గంభీర్
Sleep well in hell #RiyazNaikoo! Never provoke #IndianArmy!
— Gautam Gambhir (@GautamGambhir) May 6, 2020