షారూఖ్ ను కలవాలని చిన్నారుల సాహసం | Four kids run away from home with dream of meeting Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

షారూఖ్ ను కలవాలని చిన్నారుల సాహసం

Aug 15 2016 3:11 PM | Updated on Sep 4 2017 9:24 AM

షారూఖ్ ను కలవాలని చిన్నారుల సాహసం

షారూఖ్ ను కలవాలని చిన్నారుల సాహసం

ఇంటి నుంచి పారిపోయి వచ్చిన నలుగురు బాలురను బిహారలోని గయా రైల్వే స్టేషన్ లో పోలీసులు కనుగొన్నారు.

గయా: ఇంటి నుంచి పారిపోయి వచ్చిన నలుగురు బాలురను బిహారలోని గయా రైల్వే స్టేషన్ లో పోలీసులు కనుగొన్నారు. వీరిని చైల్డ్ లైన్ సంస్థ ప్రతినిధులకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ జిల్లా నుంచి వీరు పారిపోయి వచ్చినట్టు గుర్తించారు. సమీర్ అన్సారీ(5), కైశిల్ అవాద్(9), ఆకిర్ అన్సారీ(4), అర్మాన్(5) శుక్రవారం సాయంత్రం ముంబై వెళ్లే రైలు ఎక్కారు. తమ అభిమాన హీరో షారూఖ్ ఖాన్ను కలిసేందుకు వీరు ముంబైకు బయలుదేరారు.

శనివారం ఉదయం రైలు దిగి గయా రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వీరిని పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. షారూఖ్ ఖాన్ ను ఎందుకు కలవాలనుకున్నారని పోలీసులు ప్రశ్నించగా... అతడి డైలాగులు, డాన్స్ స్టెప్పులు, సినిమాల్లో పాటలు, అతడు నవ్వే స్టయిల్ బాగుంటుందని చిన్నారులు అమాయకంగా బదులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement