మాజీ ముంబై పోలీస్ కమీషనర్ పై దాడి! | Former Mumbai police chief Satyapal Singh attacked in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

మాజీ ముంబై పోలీస్ కమీషనర్ పై దాడి!

Apr 10 2014 1:33 PM | Updated on Aug 14 2018 4:21 PM

బోగస్ ఓట్లను అడ్డుకునేందుకు వెళ్లిన బీజేపీ అభ్యర్ధి, మాజీ ముంబై పోలీస్ కమీషనర్ సత్యపాల్ సింగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు చితకబాదారు.

లక్నో: బోగస్ ఓట్లను అడ్డుకునేందుకు వెళ్లిన బీజేపీ అభ్యర్ధి, మాజీ ముంబై పోలీస్ కమీషనర్ సత్యపాల్ సింగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో భాగపట్ నియోజకవర్గంలోని మలక్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మలక్ పూర్ గ్రామస్తులు సత్యపాల్ సింగ్ మోటార్ కాన్వాయ్ పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ, పౌర విమానయాన శాఖా మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అభ్యర్థి అజిత్ సింగ్ పోటీలో ఉన్నారు. 
 
కాన్వాయ్ పై జరిగిన దాడిలో సత్యపాల్ సింగ్ కారు ధ్వంసమైందని, ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. దాడి తర్వాత సత్యపాల్ సింగ్ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారని.. పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. దాడికి కారణమైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement