రాయ్‌బరేలి రాబిన్‌హుడ్‌ కన్నుమూత

Former Congress MLA Akhilesh Singh passes away  - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అఖిలేష్‌ సింగ్‌ ఇకలేరు. గత కొద్ది కాలంగా కాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం కన్నుమూశారు. రాయ్ బరేలిలోని ఆయన గ్రామమైన లాలూపూర్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించిన తరువాత కూడా స్వతంత్ర అభ్యర్థిగా తన స్థానాన్ని గెలుచుకున్న అఖిలేష్ సింగ్ రాయబరేలిలో  ప్రముఖ నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఐదుసార్లు శాసనసభ్యుడైన ఆయనపై అనేక కేసులు నమోదైనప్పటికీ, నియోజవర్గ ప్రజలు ఆయనను రాయ్‌బరేలీ రాబిన్‌హుడ్‌గా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన కుమార్తె అదితి సింగ్, ఉత్తరప్రదేశ్‌లోని సదర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top