మసాల దోశ, బిర్యానీ ఏ పాపం చేశాయి?

Desi Menu For Astronauts On Indias First Manned Spaceflight Gaganyaan - Sakshi

న్యూఢిల్లీ: మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్‌యాన్‌ను నింగిలోకి పంపేందుకు ఇస్రో ఒక బృందాన్ని సిద్ధం చేసింది. ఎనిమిదిమందితో కూడిన ఈ బృందం రష్యాలో శిక్షణ పొందగా వీరిలో నలుగురిని ఎంపిక చేసినట్లు ఇస్రో చైర్మెన్ శివన్ తెలిపారు. అయితే వారి సమాచారాన్ని ఇప్పటిదాకా బయటకు రాలేదు. తాజా ఇస్రో అధికారులు అంతరిక్షంలోకి వెళ్తున్న నలుగురు వ్యోమగాములకు ఎలాంటి ఫుడ్ ఉండాలో నిర్ణయించారు. వీరికి పూర్తిగా స్వదేశీ ఆహారాన్ని మాత్రమే ఇస్తున్నారు. ఆ ఆహార పదార్థాల లిస్టులో ఇడ్లీ, మూంగ్ దాల్, హల్వా, వెజ్ పులావ్, ఎగ్ రోల్స్‌ను డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ లాబొరేటరి తయారు చేసింది. దీంతో పాటు ఫుడ్ హీటర్స్‌ను వ్యోమగాములకు అందుబాటులో ఉంచనున్నారు.

అంత‌రిక్షంలో తేలియాడే వ్యోమ‌గాముల కోసం తాగేందుకు ప్రత్యేకమైన కంటెయిన‌ర్లు త‌యారు చేశారు. వాట‌ర్‌, జ్యూస్‌ల‌ను తీసుకువెళ్లేందుకు స్పెష‌ల్ ప్యాకెట్లను డీఆర్‌డీవో త‌యారు చేసింది. వచ్చే ఏడాది చివర్లో లేదా 2022లో గగన్ యాన్ ప్రాజెక్ట్ ను చేపట్టడానికి ఇస్రో రెడీ అవుతుంది. అయితే ఈ ఫుడ్‌ మెనూపై సోషల్‌ మీడియాలో సైటైర్లు పేలుతున్నాయి. కొందరు నెటిజన్లు ఫన్నీగా అన్నీ ఉన్నాయి.. మరి 'మసాల దోశ, బిర్యానీ ఏ పాపం చేశాయి?' వాటిని మెనూలో ఎందుకు చేర్చలేదు' అని ఓ నెటిజన్ ఇస్రోకి ట్వీట్ చేశాడు. 'రసగుల లేదా.. ఇది చాలా చీప్ మెనూ' అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. 'పోహా కహా హై' అని మరో నెటిజన్ అడిగాడు. 'నో సాబుదాన వడా ఫర్‌ ఫాస్టింగ్‌ ఆస్ట్రోనాట్స్‌' అని ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలా నెటిజన్లు రకరకాలుగా సరదా కామెంట్స్‌తో ఇస్రోని ప్రశ్నిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top