
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిషేధాజ్ఞల వల్ల ఇక్కడి ఇందిరాగాంధీ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వెయ్యికిపైగా విమానాలు ప్రభావితం కానున్నాయి. గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 18 నుంచి 26 వరకూ రోజూ ఉదయం 10.35 గంటల నుంచి 12.15 గంటల వరకు గగనతలంపై నిషేధం ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పలు విమానయాన సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీచేసిందన్నారు.