పరువు నష్టం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు హాజరయ్యారు.
న్యూఢిల్లీ : పరువు నష్టం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు హాజరయ్యారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా కోర్టుకు హాజరు అయ్యారు. ఈ సందర్బంగా కేజ్రీవాల్ తనకు క్షమాపణ చెప్పనవసరం లేదని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే సరిపోతుందని అన్నారు.
అయితే కేజ్రీవాల్ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేందుకు ససేమీరా అన్నారు. కాగా అవినీతి పరుల జాబితాలో తన పేరు చేర్చడంపై నితిన్ గడ్కరీ...కేజ్రీవాల్ పై పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్లారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు.