హోలీ వేడుకలకు దూరంగా ఉందాం!

Corona effect PM Modi to skip Holi Milan programme - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రపంచ దేశాలను వణికిస్తూ...మెల్లగా  మన దేశంలో కూడా నేనున్నాంటున్న కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) వ్యాప్తిపై ఉలాంటి ఆందోళన అవసరం లేదని  ప్రకటించిన భారత  ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న కరోనా వైరస్ ఆందోళనల దృష్ట్యా, ఈ సంవత్సరం హోలీ వేడుకలకు దూరంగా వుంటున్నానని ప్రధాని ప్రకటించారు. అలాగే ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు  హోలీ పండుగ వేడుకలకు దూరంగా ఉండాలని  ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విటర్లో  ఒక సందేశాన్ని ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామూహిక సమావేశాలను తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇటలీనుంచి వచ్చిన  టూరిస్టులు 15 మందికి వ్యాధి సోకినట్టుగా  బుధవారం నిర్ధారణ అయింది. దీంతో  తాజా కేసులతో భారతదేశంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 18కి చేరింది.

చదవండి : 

కరోనా కలవరం:  ఢిల్లీలో మరో 15 కేసులు,  

కరోనా ఎఫెక్ట్‌: ఆ ఎగుమతులపై ఆంక్షలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top