‘నారాయణ, చైతన్య’లపై సీఐడీ దాడులు | CID rides at Narayana and chaitanya colleges | Sakshi
Sakshi News home page

‘నారాయణ, చైతన్య’లపై సీఐడీ దాడులు

Apr 16 2016 4:15 AM | Updated on Aug 11 2018 8:21 PM

కర్ణాటకలోని పలు ప్రైవేటు కళాశాలలపై సీఐడీ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు.

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని పలు ప్రైవేటు కళాశాలలపై సీఐడీ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. ద్వితీయ పీయూసీ రసాయన శాస్త్రం ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు. బెంగళూరు, బళ్లారిలోని నారాయణ, చైతన్య కళాశాలలతోపాటు తుమకూరు, మంగళూరులో ఉన్న మొత్తం 11 ప్రైవేటు కళాశాలల్లో సోదాలు చేశారు. దాడుల్లో ప్రశ్నపత్రం లీకుకు సంబంధించి పలు ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement