విమానంలో చిరుతపులి పిల్ల.. పాలు పట్టిన సిబ్బంది

Chennai Airport Staff Feeds Leopard Cub Which Smuggled From Bangkok - Sakshi

చెన్నై : చిరుత పులి పిల్లను స్మగ్లింగ్‌ చేస్తున్న వ్యక్తిని చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగేజ్‌ చెక్‌ చేస్తున్న సమయంలో నెలన్నర వయసు ఉన్న చిరుత పులి పిల్ల బయటపడింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు ఇంటిలెజిన్స్‌ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చెన్నైలోని ఆరినగర్‌ అన్నా జువాలాజికల్‌ పార్కుకు తరలించారు. కాగా భయంతో వణికిపోతున్న చిరుత పులి పిల్లను ఎయిర్‌పోర్టు సిబ్బంది అక్కున చేర్చుకున్నారు. అనంతరం దానికి పాలు పట్టించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top