చంద్రునికి మరింత చేరువగా

Chandrayaan 2 Another Step Closer to Moon - Sakshi

బెంగళూరు : చంద్రయాన్‌ 2 ప్రయోగంలో మరో కీలకఘట్టం చోటుచేసుకుంది. మూడో లూనార్‌ బౌండ్‌ కక్ష్యలోకి చంద్రయాన్‌ 2  ఉపగ్రహాన్ని బుధవారం ఉదయం విజయవంతంగా చేర్చినట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రునికి 200 కి.మి దగ్గరగా..1500 కి.మి దూరంగా ఉన్న కక్ష్యలోకి చంద్రయాన్‌ 2ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 30న కక్ష్య దూరాన్ని మరింత తగ్గించనున్నారు. సెప్టెంబర్‌ 1 నాటికి చంద్రునికి అతి దగ్గరగా ఉపగ్రహాన్ని తీసుకెళ్తారు. సెప్టెంబర్‌ 2న ఉపగ్రహం నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ వేరుపడనుంది. ఇది సెప్టెంబర్‌ 7న చంద్రుని ఉపరితలంపై దిగనుంది. చంద్రయాన్‌ 2 తీసిన భూమి ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. జులై 22న నెల్లూరులోని సతీష్‌ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇస్రో చంద్రయాన్‌ 2ను విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. ఇది చదవండి : చంద్రయాన్‌–2కు చంద్రుడి కక్ష్య దూరం తగ్గింపు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top