పాఠశాలకు బాంబు బెదిరింపు, తనిఖీలు | Bomb scare at Saraswati Vidya Mandir school in Kanpur's Chakeri. Classes dismissed | Sakshi
Sakshi News home page

పాఠశాలకు బాంబు బెదిరింపు, తనిఖీలు

Apr 18 2016 11:15 AM | Updated on Sep 3 2017 10:11 PM

ఓ పాఠశాలలో బాంబు పెట్టారంటూ వదంతులు వ్యాపించడంతో కలకలం రేగింది.

కాన్పూర్: ఓ పాఠశాలలో బాంబు పెట్టారంటూ వదంతులు వ్యాపించడంతో కలకలం రేగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా, చకేరీ టౌన్లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కాన్పూర్ లోని చకేరీ టౌన్లో ఉన్న సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో బాంబు పెట్టినట్టు వదంతులు వచ్చాయి.

దాంతో ఒక్కసారిగా పాఠశాలలో భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో క్లాసులను నిలిపివేసి.. విద్యార్థులను బయటకు పంపివేయగా, తనిఖీలు కొనసాగుతున్నట్టు సమాచారం.

Advertisement

పోల్

Advertisement