ఎంపీలుగా అమిత్‌షా, స్మృతి ప్రమాణం | BJP President Amit Shah, Smriti Irani takes oath as Rajya Sabha MP | Sakshi
Sakshi News home page

అమిత్‌షా, స్మృతి ప్రమాణ స్వీకారం

Aug 25 2017 11:48 AM | Updated on May 28 2018 3:58 PM

రాజ్యసభ సభ్యులుగా బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, స్మృతి ఇరానీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం పదిన్నర సమయంలో ఇరువురు ప్రమాణం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఇరువురు బీజేపీ నేతలతో ప్రమాణ స్వీకారం చేయించారు.

సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ సంస్కృతంలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అమిత్‌ షా... పార్టీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. కాగా అమిత్‌ షా, స్మృతి ఇరానీ ..రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement