బీజేపీ ఎంపీలకు రెండ్రోజుల శిక్షణ..

BJP To Organise Two Day Mandatory Training For All MPs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్టీలో క్రమశిక్షణను ఇనుమడింపచేయడంతో పాటు పలు అంశాలపై అవగాహన పెంచేందుకు పార్టీ ఎంపీలందరికీ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఆగస్ట్‌ 3, 4 తేదీల్లో నిర్వహించే ఈ శిక్షణా కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా హాజరై పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేస్తారు.

శని, ఆదివారాలు రెండ్రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు దేశ రాజధానిలో అందుబాటులో ఉండాలని ఎంపీలందరికీ పార్టీ పార్లమెంటరీ కార్యాలయం నుంచి మెసేజ్‌లు వెళ్లాయి. ఈ కార్యక్రమంలో మోదీ, షాలతో పాటు పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారు. పార్లమెంట్‌ సమావేశాలకు సభ్యుల హాజరు తక్కువగా ఉండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బీజేపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top