'గోవా బీచ్ల్లో డాన్స్ బార్లు మూసేయండి' | BJP MLA sits on hunger strike against dance bars | Sakshi
Sakshi News home page

'గోవా బీచ్ల్లో డాన్స్ బార్లు మూసేయండి'

Feb 23 2015 1:09 PM | Updated on Mar 29 2019 8:30 PM

గోవా బీచుల్లోని డ్యాన్సింగ్ బార్స్ అన్నీమూసేయాలని అక్కడి బీజేపీ పార్టీ సీనియర్ నేత మైఖేల్ లోబో నిరాహార దీక్షకు దిగారు.

గోవా బీచ్ల్లో డ్యాన్సింగ్ బార్లు మూసివేయాలని బీజేపీ పార్టీ సీనియర్ నేత మైఖేల్ లోబో సోమవారం నిరాహార దీక్షకు దిగారు. ముఖ్యంగా కలాంగుటె బాగా బీచ్ వెంట డ్యాన్స్ క్లబ్బులన్నీ మూతపడేయాలని ఆయన డిమాండ్ చేశారు. పురుషులు బాగా తాగేసి ఈ పబ్బుల్లో చిందులేస్తున్న కారణంగా దాని చుట్టుపక్కల ఉన్న మహిళలంతా బాధపడాల్సి వస్తుందని, అంతేకాకుండా మహిళలు అభద్రతకు గురి అవుతున్నారని మైఖేల్ లోబో పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఇలాంటి పబ్బులను నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు. బాగా బీచు సర్కిల్ వద్ద మైఖేల్ లోబో తన మద్దతు దారులతో దీక్షకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement