న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి చేయాలంటూ రూపొందించిన ప్రైవేటు మెంబర్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు.
బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ ఈ బిల్లును సభ ముందుంచుతారు. విద్యాసంస్థల పాఠ్య పుస్తకాల్లో నైతిక బోధనగా భగవద్గీత నిర్భంధ బోధన బిల్లుగా ఈ బిల్లును వ్యవహరించనున్నారు. అయితే మైనార్టీలకు చెందిన విద్యాసంస్థల్లో దీన్ని కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధనను ఈ బిల్లులో చేర్చలేదు.