రైల్వే మంత్రికి ప్రముఖ నటి ఫిర్యాదు | Actress Tweeted Suresh Prabhu About Rats In First Class. Bag Destroyed | Sakshi
Sakshi News home page

రైల్వే మంత్రికి ప్రముఖ నటి ఫిర్యాదు

Sep 27 2016 3:00 PM | Updated on Sep 4 2017 3:14 PM

రైల్వే మంత్రికి ప్రముఖ నటి ఫిర్యాదు

రైల్వే మంత్రికి ప్రముఖ నటి ఫిర్యాదు

రైలు ప్రయాణం తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని ప్రముఖ మరాఠి నటి నివేదిత సరాఫ్ రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ఫిర్యాదు చేశారు.

ముంబై: రైలులో ప్రయాణిస్తుండగా తన బ్యాగును ఎలుక కొరికేసిందని ప్రముఖ మరాఠి నటి నివేదిత సరాఫ్.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ఫిర్యాదు చేశారు. రైళ్లలో ఎలుకల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రైలులో తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రికి వివరించారు. సెప్టెంబర్ 22న లాతూర్ ఎక్స్ప్రెస్ లో ఏసీ బోగీలో ఆమె ప్రయాణించారు. తన బ్యాగును తల పక్కన పెట్టుకుని నిద్రపోయింది. లేచి చూసేసరికి ఆమె బ్యాగును ఎలుక కొరికేసింది.

రైలు ప్రయాణం తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని ఆమె వాపోయింది. ఎలుక కొరికిన బ్యాగు ఫొటో కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనిపై సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ స్పందించారు. ఎలుకలను పెస్ట్ కంట్రోల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పట్టుకుంటారని చెప్పారు. ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామని సెంట్రల్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నివేదిత సరాఫ్ ఫిర్యాదు నేపథ్యంలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి చెబుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement