ఆ చెత్తంతా ఆపండి.. ఖుష్బూ ఫైర్‌!

Actress Khushbu Fires On Campaign Of Cow Urine Treat Corona - Sakshi

గోమూత్రం, పేడ కరోనా వైరస్‌కు మందంటూ చేస్తున్న ప్రచారంపై సినీ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు ఖుష్బూ మండిపడ్డారు. ఆదివారం ట్విటర్‌ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘ గుడ్డివాళ్లు ఇకనైనా మేల్కొంటారా? గోమూత్రం అన్ని రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపండి. మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మతాలను, కాషాయ రంగును ప్రవేశపెట్టొద్దు. చదువుకోని పేదలను తప్పుదోవ పట్టించొద్దు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, కోవిడ్‌ను నివారించే శక్తి కేవలం గో మూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి దేశ నలుమూలల నుంచి దాదాపు 200మందికి పైగా అతిథులుగా హాజరవ్వడం గమనార్హం. ( కరోనా ఎఫెక్ట్‌: గో మూత్రంతో విందు )
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top