గొవా వెళ్లండి ఉల్లి గెలవండి

AbhiBus Was Surprised To Find More People Prefer Onions Over Goa Trip - Sakshi

దేశంలో రోజురోజుకు ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఉల్లిని కొనాలంటే సామాన్య ప్రజలు జంకుతున్నారు. ఉల్లి కొందామని మార్కెట్‌కు వెళ్లినవారికి.. అక్కడి ధరలు చూస్తే చుక్కలు కనబడుతున్నాయి. ఇక కిలో ఉల్లి ధర డబుల్‌ సెంచరీ దాటడంతో సోషల్‌ మీడియాలో, టిక్‌టాక్‌లలో ఫన్నీ వీడియోలు, మీమ్స్‌  వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ పర్యాటక సంస్థ అబిబస్‌.కామ్‌ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌ ద్వారా గోవా ట్రిప్‌ బుక్‌ చేసుకున్న వారికి 3 కిలోల ఉల్లిని బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పర్యాటక ప్రీయులంతా ఈ ఆఫర్‌కు ఫిదా అవుతూ గోవా పర్యటనకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే గోవా టూర్‌కు అధిక డబ్బులు వెచ్చించిన వారికి ఆపిల్‌ ఐ ఫోన్ లేదా ఈ-బైక్‌లను గెలుచుకునే మరో ఆఫర్‌ను కూడా అబిబస్‌ ప్రకటించింది. అయినప్పటకీ అధిక శాతం వినియోగదారులను బుకింగ్‌లో ఉల్లిపాయ బహుమతినే ఎంచుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనిపై ఆ సంస్థ సీవోవో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. అత్యధిక ​వినియోగదారులు గోవా పర్యటనకంటే కూడా ఉల్లిపాయాలకే ప్రాధాన్యత ఇవ్వడం చూసి ఆశ్యర్యపోయానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో బంగారు ఆభరణాలు, విలువలైన వస్తువుల కంటే ఉల్లికే అధిక డిమాండ్‌ ఉందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు. ఈ ఆఫర్‌కు వచ్చిన స్పందన చూస్తే.. తాము వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు అందిస్తున్నామన్న సంతృప్తి కలిగిందని చెప్పారు. తమ నిర్ణయం సరైందనే నమ్మకం వచ్చిందని పేర్కొన్నారు. 

ఈ ఆఫర్‌ ద్వారా ప్రతి రోజు 20 మందిని విజేతలుగా ప్రకటించి.. వారికి 3 కిలోల ఉల్లిని ఇంటికి డెలివరీ చేస్తామని రోహిత్‌ తెలిపారు. డిసెంబర్‌ 10న ప్రకటించిన ఈ ఆఫర్‌కు మంచి స్పందన లభించిందని చెప్పారు. పర్యాటక ప్రదేశాల ఎంపికలో.. వెనుకంజలో ఉండే గోవా ఈ ఆఫర్‌తో మొదటి సారిగా రెండవ స్థానంలో నిలిచిందని అన్నారు. డిసెంబర్‌ 15 వరకు ఉండే ఈ ఆఫర్‌ కోసం  అబిబస్‌ వెబ్‌సైట్‌ ద్వారా గోవా టూర్‌ బుక్‌ చేసుకోని పోటీలో నిలువవచ్చని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top