
44 కిలోల బంగారం పట్టివేత
ట్రక్కులో అక్రమంగా భారీ మొత్తంలో తరలిస్తున్న బంగారాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు.
న్యూఢిల్లీ: ట్రక్కులో అక్రమంగా భారీ మొత్తంలో తరలిస్తున్న బంగారాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 44 కేజీల బంగారాన్ని ట్రక్కులో నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ట్రక్కును సీజ్ చేసినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది.