హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు మధ్యాహ్నం సుమారు 25 కార్లు దగ్ధమయ్యాయి.
బెంగళూరు: హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు 25 కార్లు దగ్ధమయ్యాయి. మారతహళ్ళి రింగ్ రోడ్డులోని కాడుబీచనహళ్ళిలో మేరు క్యాబ్స్ పార్కింగ్ స్పాట్ ఉంది. మధ్యాహ్నం ఇక్కడ సుమారు 100 పైగా క్యాబ్స్ పార్క్ చేసి ఉన్నాయి. ఉన్నట్లుండి అక్కడ మంటలు వ్యాపించాయి.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఏడు వాహనాలతో వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే 15 కార్లు పూర్తిగా, పది కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి కారణాలు తెలియలేదు.