
అమెరికాకు స్వాగతం!
అమెరికా నేపథ్యంలో ప్రియాంక, దీపికా పర్‌మర్, కిమ్‌బెర్లి ఇగ్లా, నాగినీడు, ఝాన్సీ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వెల్‌కమ్ టు అమెరికా’. స్వీయదర్శకత్వంలో యు.ఎస్. రాజు
అమెరికా నేపథ్యంలో ప్రియాంక, దీపికా పర్‌మర్, కిమ్‌బెర్లి ఇగ్లా, నాగినీడు, ఝాన్సీ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వెల్‌కమ్ టు అమెరికా’. స్వీయదర్శకత్వంలో యు.ఎస్. రాజు రూపొందించిన ఈ చిత్రానికి చిత్ర కథానాయకుడు పృథ్వీ చంద్ర పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో సంగీతదర్శకుడు కేఎం. రాధాకృష్ణన్ సీడీని ఆవిష్కరించి నిర్మాత రమేష్ పుప్పాలకు అందించగా, సంస్థ లోగోను ‘దిల్’ రాజు ఆవిష్కరించారు. దర్శక, నిర్మాత మాట్లాడుతూ- ‘‘పృథ్వీచంద్ర మంచి పాటలిచ్చారు. నటుడిగా కూడా తనకు గుర్తింపు తెచ్చే చిత్రమిది. అమెరికాలో 64 లొకేషన్స్‌లో ఈ చిత్రం చేశాం’’ అన్నారు.