
అమెరికాకు స్వాగతం
‘‘అమెరికాలో చేసిన అచ్చ తెలుగు చిత్రం ఇది. ఇందులో మంచి పాత్ర చేశాను’’ అని కోట శ్రీనివాసరావు చెప్పారు. గాయకుడు పృథ్వీ చంద్రను హీరోగా పరిచయం చేస్తూ,
‘‘అమెరికాలో చేసిన అచ్చ తెలుగు చిత్రం ఇది. ఇందులో మంచి పాత్ర చేశాను’’ అని కోట శ్రీనివాసరావు చెప్పారు. గాయకుడు పృథ్వీ చంద్రను హీరోగా పరిచయం చేస్తూ, స్వీయదర్శకత్వంలో యు.ఎస్. రాజు నిర్మించిన చిత్రం ‘వెల్‌కమ్ టు అమెరికా’. ప్రియాంక, దీపికా పర్‌మర్, రింబెర్లి ముఖ్య తారలు. ఈ చిత్రం లోగో, ప్రచార చిత్రాన్ని కోట ఆవిష్కరించారు. యు.ఎస్. రాజు మాట్లాడుతూ -‘‘వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని అమెరికాలోని 64 అందమైన లొకేషన్స్‌లో తీశాం. అమెరికా వెళ్లాలనే కల చాలామందికి ఉంటుంది. కానీ, కొందరే సాకారం చేసుకోగలుగుతారు. ఈ చిత్రం అమెరికా వెళ్లిన ఫీల్ కలుగజేస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.