బాహుబలి యూనిట్లో మార్పులు | visual effects supervisor change in bahubali crew | Sakshi
Sakshi News home page

బాహుబలి యూనిట్లో మార్పులు

Oct 29 2015 10:15 AM | Updated on Jul 14 2019 4:18 PM

బాహుబలి యూనిట్లో మార్పులు - Sakshi

బాహుబలి యూనిట్లో మార్పులు

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఈ భారీ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. బాహుబలి అంతటి ఘనవిజయం...

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఈ భారీ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. బాహుబలి అంతటి ఘనవిజయం సాదించటం వెనక నటీనటుల కృషి ఎంత ఉందో, అంతకు మించి విజువల్ గ్రాఫిక్స్ కీరోల్ ప్లే చేశాయి. అయితే ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్గా పనిచేసిన శ్రీనివాస్ మోహన్ బాహుబలి 2కు పనిచేయటం లేదు.

డిసెంబర్ నుంచి బాహుబలి 2ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇదే సమయంలో శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం రోబో 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుండటంతో శ్రీనివాస్ మోహన్ బాహుబలి యూనిట్కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్గా మరొకరిని తీసుకోవాలని నిర్ణయించాడు రాజమౌళి.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాకు అత్యుత్తమ గ్రాఫిక్స్ అందించి జాతీయ అవార్డ్ సాధించిన ఆర్ సి కమల్ కణ్ణన్ను బాహుబలి 2కు గ్రాఫిక్స్ సూపర్ వైజర్గా సెలెక్ట్ చేసుకున్నాడు రాజమౌళి. మరి శ్రీనివాస్ మోహన్ స్థానంలో వచ్చిన కమల్ కణ్ణన్ రాజమౌళి ఆలోచనలకు ఎలాంటి దృశ్యరూపం ఇస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement