ఆయన నటిస్తే బాగుంటుందని భావించా! | Vijay milton Saya about Gautham Menon character in golisoda 2 | Sakshi
Sakshi News home page

ఆయన నటిస్తే బాగుంటుందని భావించా!

Published Sat, Oct 21 2017 10:02 AM | Last Updated on Sat, Oct 21 2017 10:02 AM

Gautham Menon Vijay Milton

కోలీవుడ్‌లో ప్రామిసింగ్‌ దర్శకుల్లో గౌతమ్‌ మీనన్ ఒకరు. తన చిత్రాల్లో ఏదో ఒక సన్నివేశంలో నటుడిగా మెరిసే ఈయనకు ఇటీవల ఇతర చిత్రాల్లోనూ నటించే అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఒక పక్క విక్రమ్‌ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ధ్రువనక్షత్రం చిత్రంతో బిజీగా ఉన్నా తన మనసును హత్తుకునే పాత్రల్లో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అలా తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం గోలీ సోడా–2.

ఇంతకు ముందు వచ్చిన గోలీసోడా చిన్న చిత్రంగా రూపొంది సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం గోలీ సోడా–2. గోలీసోడా చిత్రంతో మెగా ఫోన్ పట్టిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్‌మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ఓవర్‌ వాయిస్‌ ఇచ్చిన దర్శకుడు గౌతమ్‌ మీనన్ ఇప్పుడు ఇదే చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

చిత్ర దర్శకుడు విజయ్‌మిల్టన్ వివరిస్తూ నిజం చెప్పాలంటే ఈ చిత్రం కథ రాస్తున్నప్పుడే ఇందులోని ఒక పాత్రను దర్శకుడు గౌతమ్‌మీనన్ చేస్తే బాగుంటుందని భావించానన్నారు. కథను ఆయనకు వినిపించి అందులో పాత్రలో నటిం చమని కోరగా వెంటనే అంగీకరించారని అన్నారు. ఆయనది గౌరవ పాత్రే అయినా కథకు చాలా కీలకంగా ఉంటుందన్నారు.

అదే విధంగా ఈ పాత్ర ఆయన యథార్థ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని అన్నారు. గోలీసోడా–2 చిత్రంలో దర్శకుడు గౌతమ్‌మీనన్ నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని విజయ్‌మిల్టన్ సోదరుడు భరత్‌సినీ తన రఫ్‌నోట్‌ పతాకంపై నిర్మిస్తున్నారన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement