‘నకిలీ’కి కొనసాగింపు | Vijay Antony's Next Is Pichaikaran | Sakshi
Sakshi News home page

‘నకిలీ’కి కొనసాగింపు

Nov 28 2014 1:14 AM | Updated on Sep 2 2017 5:14 PM

‘నకిలీ’కి కొనసాగింపు

‘నకిలీ’కి కొనసాగింపు

‘‘ప్రస్తుతం దేశంలో అందరూ ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంలో సాగే కథాంశమిది. ఆలోచింపజేసే ఈ సినిమా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచుతుంది’’ అంటున్నారు కథానాయకుడు విజయ్ ఆంటోనీ.

‘‘ప్రస్తుతం దేశంలో అందరూ ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంలో సాగే కథాంశమిది. ఆలోచింపజేసే ఈ సినిమా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచుతుంది’’ అంటున్నారు కథానాయకుడు విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సలీమ్’. ఈ చిత్రాన్ని కుమార్‌రెడ్డితో కలిసి సురేశ్ కొండేటి తెలుగులోకి అనువదిస్తున్నారు.

ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ -‘‘ప్రైవేటు వైద్యశాలల కారణంగా జనాలు ఎలాంటి ఇబ్బందులకు లోనవుతున్నారో ఇందులో చర్చించాం. నా ‘నకిలీ’కి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించాను’’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వస్తున్న 11వ చిత్రమిది. అతి త్వరలో తెలుగు టైటిల్ ప్రకటిస్తాం. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అక్ష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రచన: సాహితి, సమర్పణ: ఎస్.కె పిక్చర్స్, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement