‘వయసొచ్చాక అక్షయ్‌ ఇలానే ఉంటాడు’

Twitter Thinks Akshay Kumar Look Like As Kashmir Old Man After His Old Age - Sakshi

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన మిషన్ మంగళ్‌  విడుదలై  భారీ విజయం సాధించించడంతో  ఖిలాడి అక్షయ్‌ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా మరో  కొత్త విషయంతో ఖిలాడి మళ్లీ సోషల్‌ మీడియాకెక్కాడు. కాశ్మీర్‌కి చెందిన ఓ వృద్ధుడి ఫోటో ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయడంతో అక్షయ్‌ వైరల్‌ అయ్యాడు. దానికి అక్షయ్‌కు సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? 

భారత్‌ మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌  టోపి ధరించేవాడని అందరి తెలిసిన విషయమే.. అయితే అది మతపరంగా ధరించేవాడని అప్పట్లో అందరు అనుకుంటూండేవారు. అలాగే కాశ్మీర్‌ చెందిన మాజిద్‌ మీర్‌ అచ్చం అలాంటి టోపీనే రోజు ధరిస్తాడంటా. అతను కూడా మతపరంగా ధరించడం గమనార్హం. అయితే ఆయన తన ఫోటోను ‘ఇక్కడ చుడండి ఈ వృద్ధుడు ఓ క్రికెటర్‌  అభిమాని, అందుకె ఇతనిని లిటిల్‌ మాస్టర్‌ అంటూ ఉంటారని’ అనే క్యాప్షన్‌తో ఎవరో షేర్‌ చేశారు. ఇక ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ‘ఇతనికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి, వయసు వచ్చిన తర్వాత అక్షయ్‌ ఇలానే ఉంటాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఖిలాడికి 2019 బాగా కలిసొచ్చిందని చెప్పుకొవచ్చు. ఈ ఎడాది మార్చిలో అక్షయ్‌ నటించిన కేసరి సినిమా  విడుదలై  విజయం సాధించిన విషయం తెలిసిందే.  అలాగే  ఆగష్టులో విడుదలైన మిషన్‌ మంగళ్‌ కూడా బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top