భర్త తీసే సినిమాలో హీరోయిన్గా త్రిష | Trisha signs fiance Varun Manian's next production | Sakshi
Sakshi News home page

భర్త తీసే సినిమాలో హీరోయిన్గా త్రిష

Feb 7 2015 3:31 PM | Updated on Sep 2 2017 8:57 PM

భర్త తీసే సినిమాలో హీరోయిన్గా త్రిష

భర్త తీసే సినిమాలో హీరోయిన్గా త్రిష

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న త్రిష.. కొత్త సినిమాకు సైన్ చేసింది.

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న త్రిష.. సినిమాల్లో నటిస్తుందో.. లేదోనన్న అనుమానాలు చాలామందికే ఉన్నాయి. అయితే, వాటిని పటాపంచలు చేస్తూ కొత్త సినిమాకు కూడా ఆమె సైన్ చేసింది. తిరు కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వయంగా త్రిషకు కాబోయే భర్త వరుణ్ మణియన్ నిర్మిస్తున్నాడు. తన సొంత బేనర్ రేడియన్స్ మీడియా పతాకం కిందే ఈ సినిమా తీస్తున్నారు.

ఈ సినిమాలో తన పాత్ర గురించి తెలిసి త్రిష చాలా సంభ్రమాశ్చర్యాలకు గురైందని, అందుకే ఈ పాత్రను మిస్ చేసుకోకూడదని నిర్ణయించుకుందని ఓ ప్రకటనలో చెప్పారు. కుంభకోణం నేపథ్యంలో ఉండే గ్రామీణ యువతి పాత్రలో త్రిష నటిస్తోంది. ఈ సినిమాలో జై సంపత్ హీరోగా నటిస్తున్నాడు. మార్చిలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. వరుణ్తో నిశ్చితార్థం జరిగిన తర్వాత త్రిష నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే అవుతుంది.

Advertisement

పోల్

Advertisement