ఆ కల ఇప్పటికి నెరవేరింది | Today Sundeep Kishan Birthday | Sakshi
Sakshi News home page

ఆ కల ఇప్పటికి నెరవేరింది

May 7 2016 12:12 AM | Updated on Sep 15 2019 12:38 PM

ఆ కల ఇప్పటికి నెరవేరింది - Sakshi

ఆ కల ఇప్పటికి నెరవేరింది

కథాబలం ఉన్న చిత్రాల్లో నటిస్తూ, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ కిషన్. ప్రస్తుతం రాజసింహ దర్శకత్వంలో...

కథాబలం ఉన్న చిత్రాల్లో నటిస్తూ, హీరోగా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ కిషన్. ప్రస్తుతం రాజసింహ దర్శకత్వంలో ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రంలో నటించారాయన. నేడు సందీప్ కిషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.

* హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్ ట్రాఫిక్‌లో జరిగే ప్రేమకథ ఇది. ఇద్దరు ప్రేమికులు ఆ ట్రాఫిక్‌ను దాటుకుని సమస్య నుంచి ఎలా బయటపడ్డారన్నదే కథ. రియలిస్టిక్ ఎమోషన్స్ బేస్ చేసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కించాం. స్క్రీన్‌ప్లే సినిమాను పరిగెత్తిస్తుంది.

* కళాశాల అంటే ఇష్టం లేక మధ్యలోనే చదువు ఆపేసే పాత్రలో నటించా. ఎదుటివారి మనసు చదివేంత తెలివితేటలున్న అబ్బాయి పాత్ర ఇది. కమర్షియల్ డెరైక్టర్స్‌లో రాజసింహ బెస్ట్ డెరైక్టర్. నేను ఎంచుకున్న మంచి కథల్లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఒక్క అమ్మాయి తప్ప’ కూడా ఉంటాయి.  నిత్యామీనన్ ఈ చిత్రం ఒప్పుకోవడానికి కారణం కథే. నాకు, నిత్యామీనన్‌కు హైట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సెట్‌లో ఒకరిపై ఒకరు సరదాగా జోకులు వేసుకునేవాళ్లం. మంచి కథ అయితే నెగటివ్ పాత్రల్లో నటిస్తా. హిట్టు, ఫ్లాప్ గురించి పట్టించుకోకుండా ముందుకెళుతుంటా.   

* నేను ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో కృష్ణవంశీగారితో పనిచేయాలనుకునేవాణ్ణి. ‘నక్షత్రం’ చిత్రంతో ఆ కల నెరవేరింది. నేను, లావణ్యా త్రిపాఠి కలిసి తమిళంలో ‘మాయవన్’ అనే చిత్రం చేస్తున్నాం. అలాగే మరో తమిళ సినిమాలో నటిస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement