ఈసారైనా కుదురుతుందా? | To make a film with Mahesh rakul interest | Sakshi
Sakshi News home page

ఈసారైనా కుదురుతుందా?

Jul 8 2016 2:46 AM | Updated on Aug 3 2019 1:14 PM

ఈసారైనా   కుదురుతుందా? - Sakshi

ఈసారైనా కుదురుతుందా?

తెలుగు పరిశ్రమలో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ ఒకరు. స్టార్ హీరోల సరసన దూసుకెళుతున్న రకుల్‌కి ...

తెలుగు పరిశ్రమలో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ ఒకరు. స్టార్ హీరోల సరసన దూసుకెళుతున్న రకుల్‌కి ప్రత్యేకంగా ఓ స్టార్ హీరో సరసన నటించాలనే ఆకాంక్ష ఉంది. ఆ స్టార్ ఎవరో కాదు.. హ్యాండ్‌సమ్ హీరో మహేశ్‌బాబు. వాస్తవానికి ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో కాజల్ అగర్వాల్ చేసిన క్యారెక్టర్‌కి ముందు ఈ బ్యూటీనే అనుకున్నారు. ఐతే.. బ్యాడ్ లక్. డేట్స్ కుదరక ఆ అవకాశాన్ని వదులుకున్నారు రకుల్. ‘భవిష్యత్తులో మహేశ్ సరసన నటించే అవకాశం వస్తుందనే నమ్మకం ఉంది’ అని ఆ సమయంలో రకుల్ పేర్కొన్నారు. ఆ సమయం ఇప్పుడు వచ్చేసిందని సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో పరిణీతీ చోప్రాను కథానాయికగా తీసుకున్నారనే వార్త వినిపించింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ పేరు వినిపిస్తోంది. మహేశ్‌తో సినిమా చేయడానికి రకుల్ ఆసక్తిగా ఉన్నారు కాబట్టి, ఈ అవకాశాన్ని వదులుకోకూడదనుకుంటున్నారట.


మరి.. ఈసారైనా ఈ జోడీ కుదురుతుందో? లేదో చూడాలి. ఆ సంగతలా ఉంచితే.. ఆల్రెడీ పరిణీతి పేరు వినిపించింది కాబట్టి ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారేమోననే ఊహాగానాలు నెలకొన్నాయి. ఓ నాయికగా రకుల్, మరో నాయికగా పరిణీతి నటిస్తారేమో? ఈ నెలలోనే ఈ చిత్రం ఆరంభం కానుంది. సో.. మహేశ్ సరసన ఎవరు చాన్స్ కొట్టేస్తారనేది త్వరలోనే తెలిసిపోతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement